చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానులేనని అలా కాకుండా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తి సీఐ రామారావు హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని తొండపాడు గ్రామంలో పోలీసు సిబ్బందితో కలిసి సీఐ రామారావు కార్డెన్, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలో అనుమానితులు, రౌడీ షీటర్ల గృహాలను తనిఖీ చేశారు. సైబర్ మోసాల పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అల్లర్లకు పాల్పడితే గ్రామ బహిష్కరణ చేసి రౌడీ షీట్ తెరుస్తామని అన్నారు. రౌడీ షీటర్ల గృహాలలో సోదాలు చేశారు.