గంగాధర నెల్లూరు: రేపు కార్వేటి నగరంలో ఎమ్మెల్యే పర్యటన
కార్వేటి నగరం మండలం చౌటూరు గ్రామంలో ఎమ్మెల్యే థామస్ పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయం శనివారం తెలిపింది. కృష్ణ సముద్రం గ్రామానికి చేరుకొని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కోల్పోయిన నానమ్మ అనే బాధితురాలికి 50 వేల చెక్కు పంపిణీ చేయనున్నారు. అనంతరం గ్రామస్థులతో సమీక్షించనున్నారు.