వినూతన రకాల పంట సాగుపై దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి
Dhone, Nandyal | Sep 23, 2025 రైతులు స్థానికంగా లభించే నాటు రకాలకే పరిమితం కాకుండా అధిక దిగుబడి ఇచ్చే వినూత్న రకాలను సాగు చేయాలని రైతులకు కలెక్టర్ రాజకుమారి సూచించారు. బేతంచెర్ల మండలం సీతారామపురం, ఎంబాయి గ్రామంలో మంగళవారం ఆమె పర్యటించారు. ఉల్లి రైతులు కలెక్టర్‌ను కలిసి గిట్టుబాటు ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలను సందర్శించి, సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు.