కుప్పం: కెనుమాకూలపల్లి సంతలో గుత్తేదారులు దౌర్జన్యం చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మార్పీఎస్ నేత దేవరాజు
కేనుమాకులపల్లి సంతలో గుత్తేదారులు దౌర్జన్యం చేస్తున్నారని పోలీసులకు బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఫిర్యాదు చేశారు ఎమ్మార్పీఎస్ నేత దేవరాజు.దౌర్జన్యం చేస్తున్న గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలిపంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, పట్టించుకోలేదనీ,గెజిట్ ప్రకారం డబ్బులు వసూలు చేయకుండా అధికంగా వసూలు చేస్తున్నారు.ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారనీ తెలిపారు.