తాడిపత్రి మండలం ఆలూరు కోనక్షేత్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో శనివారం ధనుర్మాస పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అభిషేకాలు, పంచామృత అభిషేకం, కాగడ హారతి వంటి పూజలను నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.