అమరచింత: అమరచింత యూనియన్ బ్యాంకులో చోరీ యత్నంపై బ్యాంకును పరిశీలించిన ఎస్పీ రావుల గిరిధర్
అమరచింత యూనియన్ బ్యాంకు చోరీయత్నంపై ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రావుల గిరిధర్: జిల్లా పరిధిలోని అమర్ చింత యూనియన్ బ్యాంకు లో సోమవారం బయటపడ్డ చోరీయత్నం ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఆరా తీశారు. ఈ మేరకు మంగళవారం ఆయన అమరచింత లోని యూనియన్ బ్యాంకు సందర్శించి చోరీయత్నాలపై వాకబు చేశారు. శని.. ఆదివారాలు బ్యాంకు సెలవులు ఉన్నందున దుండగులు చోరీయత్నానికి పాల్పడ్డారని ఎస్పి భావిస్తున్నారు. అంతకుముందే జాగిలాలు.. క్రైమ్ బ్రాంచ్ సంబంధించిన ఉద్యోగులు బ్యాంకు పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. బ్యాంకులో నగదు తో పాటు బంగారు ఆభరణాలు ఎలాంటివి చోరీ జరగలేదు