కళ్యాణదుర్గం: కుందుర్పిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ తాండవిస్తున్న అపరిశుభ్రత, ఆందోళన చెందుతున్న ప్రజలు
కుందుర్పి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చుట్టూ అపరిశుభ్రత పేరుకుపోయింది. బురద,చెత్తా చెదారం తాండవిస్తున్నది. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న సమయంలో అపరిశుభ్రత ఉండడంతో ప్రజల ఆందోళన చెందుతున్నారు. పరిశుభ్రంగా ఉండాల్సిన ఆరోగ్య కేంద్రమే అపరిశుభ్రంగా తయారైంది. వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, పంచాయితీ అధికారులు పట్టించుకోవడం లేదు. అపరిశుభ్రతను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.