మేడ్చల్: సూరారంలో బాధితులకు సీఎం సహాయనిది మంజూరు పత్రాల అందజేత
సూరారం సుభాష్ నగర్ 130వ డివిజనకు చెందిన భోగిని రవి, సబేరా భానులు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి బాధితులకు 1,50,000, 75,000 రూపాయలను మంజూరు చేయించగా ఆదివారం చింతల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డివిజన్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు బాధితుడికి ఎల్ఓసి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపద సమయంలో ఆరోగ్య రక్ష ఎల్ఓసి అని, అత్యవసర సమయంలో ఆస్పత్రి వైద్యానికి అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.