అసిఫాబాద్: రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ASF జిల్లా కలెక్టరేట్ లో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల తహసిల్దార్లతో రెవెన్యూ సదస్సుల దరఖాస్తులు, సాదా బైనమా దరఖాస్తులు, వివిధ అభివృద్ధి పనుల కొరకు సేకరించిన భూములు, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్ భూముల వివరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.