పట్టణంలోని టవర్ క్లాక్ సమీపంలో కాఫీ పొడి దుకాణం వద్ద మొబైల్ చోరీ, సీసీ కెమెరాలు రికార్డు అయిన దృశ్యాలు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని టవర్ క్లాక్ సమీపంలో ఉన్న మారుతీ కాఫీ పొడి దుకాణం వద్ద కదిరి రూరల్ మండలం మల్లయ్య గారి పల్లి కి చెందిన అశోక్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తన సెల్ ఫోను పోగొట్టుకున్నాడు. సీసీ కెమెరాను పరిశీలించగా ఓ వ్యక్తి సెల్ ఫోన్ చోరీ చేసినట్టుగా రికార్డు అయింది. దీనిపై అతడు కదిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.