భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా వైసీపీ జెండా రెపరెపలాడాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కుందుర్పి మండలం నిజవల్లి లో ఆదివారం కోటి సంతకాలు, రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో తలారి రంగయ్య మాట్లాడారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదన్నారు. ఆ కుట్రలను మనం తిప్పి కొట్టాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని అంశాలపై తాను కొట్లాడుతున్నానన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కళాశాలలు ప్రైవేటుపరం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.