అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉద్రిక్తత శవం తో రోడ్డు పై నిరసన
పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజక వర్గం అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆదివారం మధ్యాహ్నం 3 గంట సమయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రధమ చికిత్స ఆలస్యంతో షేక్ నాగుల్ 45 సంవత్సరాలు అనే వ్యక్తి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఆస్పత్రి ముందు మృతదేహంతో బంధువులు స్థానికులు ధర్నా చేపట్టారు ముదురుకి ఇద్దరు కుమారులు ఆడపిల్ల ఉన్నట్లుగా పేర్కొన్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతోనే ప్రాణం పోయిందని వారు ఆరోపించారు.