తాడిపత్రి: తాడిపత్రిలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో లోక్ కళ్యాణ్ మేళ కార్యక్రమం నిర్వహణ
తాడిపత్రిలో సోమవారం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, మెప్మా అధికారుల ఆధ్వర్యంలో ఒక కుటుంబం-ఒక వ్యాపారవేత్త లో భాగంగా లో కళ్యాణ్ మేళ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో 545 మంది స్ట్రీట్ వెండర్లను గుర్తించామన్నారు. వారికి త్వరలోనే ఒక్కొక్కరికి రూ. 15000 చొప్పున ఇస్తామన్నారు.