ఉమ్మడి ప్రకాశం జిల్లావ్యాప్తంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో శుక్రవారం రాత్రి వాహన డ్రైవర్లకు పేస్ వాష్ కార్యక్రమాన్ని చేపట్టారు. రోడ్డు ప్రమాదాల నివారణకు దూరప్రాంతాలకు వెళ్లే వాహనం డ్రైవర్లను నిలిపి వారి మొహానికి కడిగించి తిరిగి వారి గమ్యస్థానాలకు సురక్షితంగా వెళ్లే విధంగా చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ మధ్యలో నిద్ర వచ్చినట్లయితే సురక్షితమైన ప్రాంతాలలో వాహనాలు నిలుపుకొని కొద్దిసేపు నిద్రించిన అనంతరం తమ గమ్మయ స్థానాలకు చేరాలని పోలీసు అధికారులు వాహన డ్రైవర్లకు సూచిస్తున్నారు.