ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్,ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
Ongole Urban, Prakasam | Jun 11, 2025
జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలైన శ్రీ చైతన్య, నారాయణ అలాగే మరికొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆర్ఎస్యు జిల్లా అధ్యక్షులు అవినాష్ విమర్శించారు. కలెక్టరేట్ వద్ద బుధవారం సాయంత్రం నిరసన తెలిపారు. 25 వేల నుంచి మూడు లక్షల వరకు నర్సరీ నుంచి పదో తరగతి వరకు అక్రమ వసూలుకు పాల్పడుతున్నారని తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు.