పుట్టపర్తి లోని పిడి కార్యాలయం వద్ద యానిమేటర్ను మార్చాలని డ్వాక్రా మహిళలు నిరసన
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని పీడీ కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళలు ధర్నా నిర్వహించారు. మంగళవారం మధ్యాహ్నం వారు మాట్లాడుతూ.. గోరంట్ల మండలం వెంకటరమనపల్లి పంచాయతీలో మూడు గ్రామాలకు చెందిన మహిళలు డ్వాక్రా సంఘాలు నడుపుతున్నారు. అయితే నూతన యానిమేటర్ సరస్వతి సంఘాల సభ్యులకు ఇబ్బందులకు గురి చేస్తోందని తెలిపారు. సమస్యల పరిష్కారానికి తన వద్దకే రావాలని హుకుం జారీ చేసిందని, యానిమేటర్ను మార్చాలని పీడీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.