ముధోల్: తానూర్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.
Mudhole, Nirmal | Sep 15, 2025 నిర్మల్ జిల్లా తానూర్ మండలంలోని ఝరి (బి),బాలాజీ గుట్ట,మొగిలి గ్రామ పరిధిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి సమీపంలోని వాగు వద్ద, ఉండేపోళ్ళ సాయినాథ్, పొలం వద్ద, బెంబెర్ రహదారి ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలను స్థానికుడు ధర్మన్న తన మొబైల్లో లైవ్ వీడియోగా రికార్డు చేశారు.అటు మొగిలి గ్రామ శివారులో సురేష్ అనే రైతు తన చెనుకి వెళ్తున్న సమయంలో పాద ముద్రలు కనిపించడంతో గ్రూప్ లో ఫోటో వైరల్ చేశారు.దీంతో బాలాజీ గుట్ట సమీపంలో పులి పాద ముద్రలు కనిపించడంతో ఫోటో వైరల్ అవడంతో గ్రామస్తులు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “మాకు పొలాలకు వెళ్లేందుకు భయమేస్తోంది. పిల్లలు, మహిళలు