శ్రీశైలంలో శివరాత్రి మొదటి రోజు ఆదివారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.శ్రీశైలం నుంచి సాక్షి గణపతి ముఖద్వారం.శిఖరేశ్వరం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర గంటల కొద్ది, అర్ధరాత్రి వరకు వాహనాల ట్రాఫిక్ జామ్ తో ప్రజలు ఇబ్బందులు గురయ్యారు. మొదటి రోజే ఇంత ట్రాఫిక్ జామ్ ఏర్పడితే, ఇంకా బ్రహ్మోత్సవాలు పది రోజులు జరగాల్సి ఉంది.కాబట్టి పోలీసులు సరైన చర్యలు చేపట్టకపోతే వాహనదారులు భక్తులు తీవ్ర ఇబ్బందులకు రావాల్సి వస్తుంది. ఒక వైపు పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ట్రాఫిక్ జామ్ మాత్రం పెరిగిపోతుంది. ఘాట్ రోడ్ మొత్తం సింగల్ రోడ్డు కావడంతో ఈ ట్రాఫిక్ జామ్ కు ప్రధాన కారణం అయింది.