గోల్కొండ: లంగర్ హౌస్ లో ఆస్థిలో వాటా కావాలని మామపై దాడికి పాల్పడిన ట్రాఫిక్ కానిస్టేబుల్. పోలీసులకు ఫిర్యాదు
లంగర్హౌస్కి చెందిన కానిస్టేబుల్ ఎం.డి.షాహిద్ ఖాన్ అనే వ్యక్తి గత కొద్దీ రోజులుగా మామ ఆస్తిలో తనకు కూడా వాటా ఇవ్వాలంటూ ఇందిరా నగర్లో ఉంటున్న బామ్మర్ది అబ్దుల్ వాహిద్ మరియు మామ పై దాడికి పాల్పడ్డాడు. తనకి ఆస్తిలో వాటా ఇవ్వకపోతే మామ కుటుంబ సభ్యులందరి అంతు చూస్తానాంటూ బెదిరింపులకి పాల్పడ్డ కానిస్టేబుల్ షాహిద్. అధికారంతో తనను ఎవ్వరు ఏమి చేయలేరంటూ మామ కుటుంబం పై చిందులు వేశాడు . తమకు కానిస్టేబుల్ షాహిద్ నుంచి ప్రాణ హాని ఉందంటూ బాధితుడు అబ్దుల్ మోహిద్ జూబ్లీహిల్స్ పోలీసులకు పిర్యాదు చేసిన బాధితుడు..