పరిగి: పరిగి పట్టణంలో ముస్లిం సోదరులు ఐకమత్యంగా మిలాద్ ఉన్ నబి సందర్భంగా ర్యాలీ నిర్వహణ
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఆదివారం ఐదు గంటలకు మిలాద్ ఉన్ నబి సందర్భంగా ముస్లిం సోదరులు ఐక్యమత్యంగా పరిగి పట్టణంలోని బస్టాండ్ మీదుగా పెద్ద మసీదు వరకు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజల అందరి మీద ఉండాలని కోరుతున్నానని తెలిపారు. మహమ్మద్ ప్రవక్త సూచించిన విధంగా ప్రతి ఒక్కరూ శాంతి మార్గంలో పయనించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.