ఇబ్రహీంపట్నం: అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి నా వంతుగా కృషి చేస్తాను : షాద్నగర్ లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు చేరుకొని వారికి సంబంధించిన సమస్యలు డిమాండ్ల పత్రాన్ని ఎమ్మెల్యేకు సోమవారం మధ్యాహ్నం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిఐటియు నాయకుడు రాజు అంగన్వాడీల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే అంగన్వాడీల డిమాండ్ల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని వారికి మాటిచ్చారు.