సత్తుపల్లి: కొత్తకారాయిగూడెం గ్రామ శివారులోని Nsp కాలువలోకి దూకి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్య..
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయి గూడెం గ్రామ శివారులోని సాగర కాలువలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే 58 సంవత్సరాల వయసు గల వ్యక్తి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలో నేడు పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి గ్రామ శివారులోని ఎన్ఎస్పి కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వెంకటేశ్వరరావు కాలువలోకి దూకుతున్న సమయంలో పక్కనే పొలాల్లో పనిచేస్తున్న కూలీలు గుర్తించి కుటుంబ సభ్యులకు,పోలీస్ లకు సమాచారం అందించారు.