మార్కాపురం: పొదిలిలో ఇంటిపై సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న స్థానికులు
ప్రకాశం జిల్లా పొదిలి చిన్న బస్టాండు సెంటర్లో ఓ ఇంటిపైన సెల్ టవర్ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకున్నారు. సెల్ టవర్ నిర్మాణం వలన రేడియేషన్ పెరిగి అనేక చర్మవ్యాధులతో పాటు అనారోగ్య సమస్యలు వస్తాయని స్థానికులు తెలిపారు. గతంలో విశ్వనాధపురం ఓ ఇంటిపైన సెల్ టవర్ నిర్మాణం వలన పలువురికి చర్మవ్యాధులతో కంటి చూపు మందగించి అనారోగ్యానికి గురైనట్లుగా గుర్తు చేశారు. ఇప్పటికైనా సెల్ టవర్ నిర్మాణాన్ని యాజమాన్యాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు.