మేడ్చల్: అశోక్ నగర్ ప్రధాన రోడ్డుపై మరమ్మతులు చేపట్టాలని డిమాండ్
మల్లాపూర్ డివిజన్ మర్రిగూడ అశోక్ నగర్ ప్రధాన రోడ్డుపై గుంతలు పడి రోజు వాహనదారులు గాయాల పాలవుతున్నారని దీంతో ఈ రోడ్డును వెంటనే మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ నేత శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. వర్షంతో అస్తవ్యస్తంగా మారిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతూ రోడ్డుపై స్థానికులతో కలిసి బైఠాయించారు.