ముక్కంటిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి ఆళ్లగడ్డ MLA భూమా అఖిలప్రియ, సింగనమల MLA బండారు శ్రావణి, MLC గ్రీష్మ విచ్చేశారు. వీరికి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ కుమార్ రెడ్డి దంపతులు, ఆలయ ఈఓ బాపిరెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్పించారు. దర్శనం అనంతరం కలంకారి సాలువాతో వారిని సత్కరించి స్వామి, అమ్మవార్ల తీర్థప్రసాదాలను అందజేశారు.