నగరి: ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను కలిసిన మాజీ మంత్రి రోజా
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను మాజీ మంత్రి రోజా కలిశారు. యాభైఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను మంగళవారం కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి సత్కరించి అభినందనలు తెలియజేశారు. తమ చిత్రరంగ ప్రవేశం ఇళయరాజా సంగీతంతోనే ప్రారంభమైందని రోజా దంపతులు గుర్తు చేసుకున్నారు.