రాయదుర్గం: పిఆర్పీ, డిఏ బకాయిలు సాధన కోసం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ధర్నా
పిఆర్సి వెంటనే ప్రకటించాలని, డిఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గం పట్టణంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. సోమవారం సాయంత్రం ఏపిటిఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపిటిఎఫ్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిరసనలు చేపట్టినట్లు జోనల్ కార్యదర్శి రామాంజనేయులు డిమాండ్ చేశారు. పిఆర్సి కమిటీ వేయడంతోపాకటు మద్యంతర బృతి ప్రకటించాలని కోరారు. అసెస్మ్మెంట్ బుక్లెట్ విధానం రద్దు చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.