33 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి రూ.21,38,606 విలువ గల చెక్కులు అందజేసిన గుడూరు ఎమ్మెల్యే
Gudur, Tirupati | Sep 15, 2025 సీఎం సహాయనిధి పేద ప్రజలకు ఒక వరం అని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలిపారు. నియోజకవర్గంలో 33 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.21,38,606 లబ్ధిదారులకు చెక్కు రూపంలో అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. లబ్ధిదారులు: అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో ఖర్చు చేసి వైద్యం చేయించుకునే వారికి ఈ పథకం ఒక వరం లాంటిదని తెలిపారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా ఎటువంటి సహాయం అందలేదని ఆయన మండిపడ్డారు.