నారాయణ్‌ఖేడ్: నాగలిగిద్ద గ్రామంలో పరిపాలన అస్తవ్యస్తం: బీజేవైఎం మండల అధ్యక్షుడు రమేష్ ఆరోపణ
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నాగలిగిద్ద గ్రామం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని బీజేవైఎం మండల అధ్యక్షుడు రమేశ్ తెలిపారు. పంచాయతీ కార్యదర్శి స్పందించకపోవడంతో గ్రామాల్లో మురికి కాలువలు నిండిపోయాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు స్పందించి గ్రామ పరిసరాలను శుభ్రం చేయాలని కోరారు.