మోత్కూర్: అధికారం ఉన్న లేకున్నా ప్రజల పక్షాన CPM పోరాడుతుంది:CPM రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి MD.జహంగీర్
యాదాద్రి భువనగిరి జిల్లా: పేద ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులేనని అధికారం ఉన్న లేకున్నా సిపిఎం పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వర్తిస్తుందని మంగళవారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. ఈ సందర్భంగా మోత్కూర్లో జరుగుతున్న ఆత్మకూర్ గుండాల అడ్డగూడూరు మోత్కూరు మండలాల రాజకీయ శిక్షణ తరగతుల రెండో రోజు పార్టీ విశిష్టత నిర్మాణం క్లాసులో ఆయన ప్రసంగించారు. సమాజంలో దోపిడి వర్గ శక్తులకు వ్యతిరేకంగా పేద ప్రజల హక్కుల కోసం సిపిఎం అవిశ్రాంతంగా పోరాడుతుందన్నారు.