తూప్రాన్: టిప్పర్ బైక్ ఢీ... బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి ప్రమాదంలో విరిగిన రెండు కాళ్లు
Toopran, Medak | Dec 1, 2024 అతివేగంగా వస్తున్న టిప్పర్ బైక్ ను ఢీకొన్న ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి రెండు కాళ్లు విరిగిపోగా బైక్ పూర్తిగా దగ్ధమైన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధి నర్సాపురం క్రాస్ రోడ్ వద్ద ఆదివారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాలకు చోటుచేసుకుంది స్థానికుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి తూప్రాన్ గ్రామానికి చెందిన చాకలి దర్శన తన వ్యక్తి బైక్ పై వస్తుండగా టిప్పర్ ఢీకొనగా అతని బైక్ రోడ్డుపై రాసుకుంటూ వెళ్లి దగ్ధమైందని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ శివానందం గాయపడిన దశరథును అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. రాత్రి 8 గంటల వరకు ఫిర్యాదు రాలేదని ఎస్ఐ తెలిపారు.