గన్నవరం విమానాశ్రయంలో కనకదుర్గమ్మ దివ్య దర్శనం
Machilipatnam South, Krishna | Sep 14, 2025
గన్నవరం లో విజయవాడలోని దుర్గగుడిలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ దర్శనం ఇకపై గన్నవరం విమానాశ్రయంలో కూడా భక్తులకు లభ్యం కానుంది.ఆదివారం ఆలయ ఈఓ శీనా నాయక్ ఆధ్వర్యంలో, విమానాశ్రయం యొక్క అరైవల్, డిపార్చర్ బ్లాకులలో అమ్మవారి భారీ చిత్రపటాలను ఆవిష్కరించారు. ఉప ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య, అర్చకులు వెంపటి శ్రీధర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, విమానాశ్రయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.