ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యంతో పాటు ఆత్మ గౌరవంతో జీవనం సాగించవచ్చని జిల్లా కలెక్టర్ రాజాబాబు పేర్కొన్నారు. శనివారం సంతనూతలపాడు మండలం, మద్దులూరు గ్రామ పంచాయతీ లో జరిగిన స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి నెలా మూడవ శనివారం జిల్లా వ్యాప్తంగా స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు. పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించారు