ఏపీలో పెట్టుబడులకు ముందు వచ్చిన రిపేక్స్ సంస్థ ;మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
చెన్నైకి చెందిన రిఫెక్స్ ఎయిర్పోర్ట్స్ & ట్రాన్స్పోర్టేషన్ ప్రతినిధులు రోమీ జునేజా, పశుపతి నాథు మంగళవారం మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. పుణే, శ్రీనగర్ విమానాశ్రయాలలో పెట్టుబడులు పెట్టిన ఈ సంస్థ, దేశవ్యాప్తంగా మరో 12 విమానాశ్రయాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో విమానయాన రంగంలో పెట్టుబడులకు రిఫెక్స్ సంస్థ ముందుకు రావడం మంచి పరిణామమని, పెట్టుబడులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.