ఉపాధి కోసం వెళ్లి గల్ఫ్ దేశంలో మృతి చెందిన రామరాజులంకకు చెందిన మహిళ, 13 రోజులు అనంతరం స్వదేశం చేరిన మృతదేహం
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మలికిపురం మండలం రామరాజులంక గ్రామానికి చెందిన రాపాక విజయభారతి (55) అనారోగ్యంతో 13 రోజులు క్రితం మృతి చెందారు. ఆమె మృతదేహం మంగళవారం స్వగ్రామం చేరింది. ఆమెకు భర్త, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయికి వివాహం కాక మరొక అమ్మాయికి పెళ్లి కావలసి ఉంది. అనారోగ్యంతో విజయభారతి మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.