భూపాలపల్లి: వృద్ధులు వికలాంగులకు పెన్షన్ పెంచాలంటూ తాసిల్దార్ కార్యాలయం ముట్టడి : ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా నాయకుడు శ్రీనివాస్
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు సోమవారం ఉదయం 11 గంటలకు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా నాయకుడు శ్రీనివాస్ తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు పింఛన్ పెంచి ఇవ్వకుండా నిర్లక్ష్యం వస్తుందని వెంటనే వికలాంగులకు 6000 వృద్ధులకు 4000 రూపాయల పెన్షన్ చెల్లించాలని రానున్న రోజుల్లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు.అనంతరం తాసిల్దార్ కు వినతి పత్రం అందించారు.