తలుపుల మండల పర్యటనపై సీఎం షెడ్యూల్ విడుదల
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండల పరిధిలోని పెద్దన్నవారిపల్లి లో శనివారం సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం షెడ్యూల్ను విడుదల చేశారు ఉదయం 11:30 గంటలకు సీఎం పెద్దన్నవారిపల్లెకు చేరుకుంటారని, అక్కడ గ్రామంలోని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తారని తెలిపారు అనంతరం మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో ప్రజా వేదికలో పాల్గొని ప్రసంగిస్తారని, మధ్యాహ్నం 1:45 గంటలకు తిరుగు పయనం అవుతారని తెలిపారు.