మహానంది క్షేత్రంలో కార్తీక మాస పూజలు ప్రారంభం
Nandyal Urban, Nandyal | Oct 21, 2025
నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం కార్తీకమాస శోభ సంతరించుకుంది. మంగళవారం సాయంత్రం ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పురోహితులు కార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఎదుట గల ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకాశ దీపాన్ని వెలిగించారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు