బొబ్బిలి: బొబ్బిలిలో తాత్కాలిక రైల్వే టికెట్ బుకింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపిన రైల్వే అధికారులు
మూడో రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా విజయనగరం జిల్లా బొబ్బిలి రైల్వే స్టేషన్లో తాత్కాలికంగా టికెట్ బుకింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు బొబ్బిలి రైల్వే అధికారులు ఆదివారం సాయంత్రం సుమారు ఆరు గంటలకు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బుకింగ్ కేంద్రాన్ని పడగొట్టి వేరేచోట నిర్మిస్తున్న తరుణంలో పాత బుకింగ్ ఆఫీస్ కు వంద మీటర్ల దూరంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. అక్కడే జనరల్, రిజర్వేషన్ టికెట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బొబ్బిలి పరిసర ప్రాంత ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.