వాతావరణానికి అనుకూలంగా పంటలను సాగు చేసేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని మాజీ వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎలమందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అనంతపురం నగర శివారులోని అకాలజీ సెంటర్ లో ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఏ ఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లాలోని రైతులకు వాతావరణానికి అనుకూలమైన వ్యవసాయాన్ని అందించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని తెలిపారు.