పులివెందుల: ప్రపంచం మెచ్చిన నాయకుడు ప్రధాని నరేంద్రమోడీ : వేంపల్లి లో BJP జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్
Pulivendla, YSR | Sep 17, 2025 ప్రపంచం మెచ్చిన నాయకుడు దేశ ప్రధాని నరేంద్రమోడీ అని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు.మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక రాజీవ్ నగర్ కాలనీ లో గల అమ్మ అనాధ ఆశ్రమంలో బిజెపి జనసేన నాయకులు కేక్ కట్ చేసి, మొక్కలు నాటి, అన్న వితరణ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ బాధ్యతలు తీసుకున్న తర్వాత అంత్యోదయ స్ఫూర్తి తో అనేక సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. ప్రధాన మంత్రి అన్నయోజన, కిసాన్ సమ్మాన్ నిధి, ఆయుష్మాన్ భరత్, జాతీయ రహదారులు నిర్మాణం వంటి కార్యక్రమాలతో దేశాన్ని అభివృద్ధి బాటలో కి తీసుకువెళ్ళారని చెప్పారు.