వాకలగరువులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రెండు ఇళ్లు దగ్దం, ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
అంబాజీపేట మండలం, వాకలగరువులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల బుధవారం ఉదయం రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బట్టలు, ఇంటి సామాన్లు పూర్తిగా కాలిపోయి, నాలుగు కుటుంబాలకు తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఘటనాస్థలికి చేరుకొని బాధితులను పరామర్శించి, అన్ని విధాలుగా ఆదుకుంటానని, ప్రభుత్వ నుంచి సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.