పలమనేరు: మండలం గంటావూరు శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్త మురుగ తెలిపిన సమాచారం మేరకు. గంగమ్మ గుడి తరపున ఎవరైతే ఓం శక్తి మాల ధారణ చేస్తారు వారందరినీ కూడా మేల్ మరువత్తూర్, కన్యాకుమారి, రామేశ్వరం తదితర ప్రాంతాలకు మూడు రోజులు తీర్థయాత్రలకు ఉచితంగా తీసుకుపోతున్నట్లు తెలిపారు. ఓం శక్తి మాల ధారణ చేసే భక్తులు ఆధార్ కలర్ జిరాక్స్ ఫోటో ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.