శ్రీకాకుళం: AIYF ఆధ్వర్యంలో స్టాప్ డ్రగ్స్ -స్టార్ట్ స్పోర్ట్స్ అనే పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్
మత్తు పదార్థాలు జోలికి యువత పోవద్దని, క్రీడల వైపు దృష్టి సారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. శుక్రవారం ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాప్ డ్రగ్స్ స్టార్ట్ స్పోర్ట్స్ అనే పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. మత్తు పదార్థాలు చెడు వ్యసనాలకు బానిసై యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటుందని ఆయన వివరించారు.. ఏఐవైఎఫ్ నాయకులు భగత్ సింగ్ స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వారు తెలిపారు..