గుండ్లూరు శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయానికి పునర్ధశ
కలికిరి మండలం గుండ్లూరు గ్రామంలోని పురాతన శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయానికి పునర్ధశ రానుంది. గుండ్లూరు చెన్నకేశవ స్వామి దేవాలయం పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణం చెసేందుకు ఎండోమెంట్ శాఖ రూ. 1.20కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసి 24లక్షలు మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఫండ్ ను బ్యాంకులో జమ చేసి సర్టిఫికెట్ ఇస్తే , 96లక్షలు జమ చేసి నిర్మాణం ప్రారంభిస్తామని ఎండోమెంట్ శాఖ తెలిపింది. ఈ మ్యూచువల్ గ్రాంట్ ఫండ్ 24లక్షలు నగదును అద్దవారిపల్లి గుర్రం వేణుగోపాల్ రెడ్డి ఆలయ అకౌంట్ కు జమ చేసినట్లు తెలిపారు.అదే విధంగా ఈయన ఇప్పటికే కోటి రూపాయలకు పైగా ఆలయ అభివృద్ధికి ఖర్చు చేశారు