నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలో రెండవ రోజు కొనసాగుతున్న మున్సిపల్ ఒప్పంద కార్మికుల నిరసన
Nirmal, Nirmal | Sep 16, 2025 మున్సిపల్ ఒప్పంద కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన మంగళవారం రెండవ రోజు కొనసాగుతుంది. గత రెండు నెలలుగా తమకు వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరారు. కాగా కార్మికులు చేపట్టిన నిరసన కారణంగా విధులు బహిష్కరించడంతో పట్టణంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు తదితరులున్నారు.