కోరేవాండ్లపల్లిలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పై అవగాహన
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం కోరేవాండ్లపల్లిలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై బుధవారం సాయంత్రం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి జీఎస్టీ తగ్గింపుపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కన్వీనర్ మాట్లాడుతూ.. నిత్యావసరాల వస్తువులపై 5% వరకు పన్నులు తగ్గినట్టు చెప్పారు. దీనివల్ల పేదలకు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని తెలిపారు.