ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లో రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురస్కరించుకొని బుధవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలమాలవేసి పోలీసులు నివాళులు అర్పించారు. ప్రాథమిక హక్కులపై సీఐలు ఎస్సైలు పోలీసు సిబ్బందికి అవగాహన కల్పిస్తూ ప్రాథమిక హక్కులను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు. నవంబర్ 26వ తేదీన రాజ్యాంగానికి ఆమోదముద్ర పడిందని సిఐలు ఎస్సైలు పోలీసు సిబ్బందికి తెలిపారు.