కుప్పం: అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్
కుప్పం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను సోమవారం మున్సిపల్ ఛైర్మన్ సెల్వరాజ్, మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, కడ అడ్వైజరీ కమిటీ సభ్యుడు రాజ్ కుమార్ పరిశీలించారు. అన్న క్యాంటీన్లో ఎలాంటి ఆహారం పెడుతున్నారని ఆరా తీశారు. పేదలకు మూడు పూటలా కడుపునిండా అన్నం పెట్టడమే అన్న క్యాంటీన్ లక్ష్యమని మున్సిపల్ ఛైర్మన్ సెల్వరాజ్ తెలిపారు.