కళ్యాణదుర్గం: కర్ణాటకలో కురిసిన వర్షాలకు వరద నిరంతా బ్రహ్మసముద్రం సమీపంలోని బీటీపీ ప్రాజెక్టులోకి చేరుతున్నది
కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో ఎగువ ప్రాంతంలో ఉన్న వాణి విలాస్ మరవ నీరు దిగువ ప్రాంతంలో ఉన్న బీటీపీ ప్రాజెక్టులోకి చేరుతున్నది. బ్రహ్మసముద్రం మండల పరిధిలోని బీటీపీ ప్రాజెక్టులోకి మంగళవారం వరద నీరు పరవళ్ళు తొక్కుతున్నది. దీంతో బీటీపీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇంకా రెండు రోజులు పాటు వరద నీరు ప్రాజెక్టు లోకి చేరే అవకాశం ఉందని బీటీపీ ప్రాజెక్ట్ అధికారులు చెప్పారు.